కల్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

కల్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో బలిజ సేవా సంఘము వారు నూతనంగా నిర్మించిన మినీ కల్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి కాపు సంఘము నాయకులు మేళాతాళాలతో పూలమాల శాలువాలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు సంఘము అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నేడు ఈ కల్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టటం చాలా సంతోషకరమైన విషయమని, కాపు సోదరుల అభివృద్ధికి తాను ఎల్లపుడు ముందుంటానని, ఎటువంటి సహకారం ఉన్న తనకు తెలియచేయవచ్చునన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, కంభం మండల కేంద్రాల్లో కాపు భవనాలకు నిధులు మంజూరు చేయటం జరిగిందని గుర్తు చేశారు. నేడు అధికారంలో ఉన్న ఎన్దీయే ప్రభుత్వం కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారికి చేదోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాలనలో అన్నీ వర్గాలకు న్యాయం చేసే దిశగా పాలన సాగిస్తున్నారని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు..

ఈ కార్యక్రమంలో గిద్దలూరు బలిజ సేవా సంఘం కమిటీ సభ్యులు మరియు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గోన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*