
నాయకా! నాటి మన గుండె ధైర్యం ఏమి అయిపోయింది
తరతరాలుగా పల్లకీలు మోస్తున్నాగాని పసిమొగ్గలను త్రుంచేస్తున్నారు. ఎన్నాళ్లీ వివక్షత? ఇంకెన్నాళ్లు అంటూ సేనకు మద్దతుగా 2015 లో మొదలు పెట్టిన అక్షర సందేశాలకు ఒక దశాబ్దం పూర్తి అయ్యింది.
నాటి నుండి నేటి వరకు గతం తలంపక, ఏకాకి వర్తమానాన్ని విచారింపక, భవిత గురించి మాత్రమే సూటిగా సుత్తి లేకుండా రాస్తూనే ఉన్నా. సేనకు మద్దతు నిస్తునే ఉన్నా. అలానే సేనను సద్విమర్శలు కూడా చేస్తూనే ఉన్నా.
ఆలోచించండి టాగ్ లైన్ తో 2015 రాసినా, ఇట్స్ ఫ్రొం అక్షర సత్యం అనే ఎండ్ లైన్ తో 2025 లో కూడా కూడా రాస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే తప్ప మరెవ్వరి కోసం కాదు. మన ఈ లక్ష్య సాధన కోసం దేవుడికి మద్దతుగా అక్షర పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
నిప్పులాంటి నిజాయితీ పరుడైన పవనేశ్వరుడిపై, ఈ సత్యం, చేసే ప్రతీ పొగడ్త వెనుక తాడిత, పీడిత, బాధిత వర్గాల మోసపోయిన కన్నీటి గాధలు మాత్రమే ఉన్నాయి. అలానే శతకోటి కొక్కడు మా పవన్ కళ్యాణ్. సేనానినే సీఎం అవ్వాలి అనే ఆవేశంతోనే సద్విమర్శలు కూడా చేసికొంటూ వస్తున్నాను అని గమనించ గలరు.
చచ్చుబడ్డ వ్యవస్థలను సరి చేయాలన్నా, పాలన పగ్గాలు అందరికీ దామాషాలో దక్కాలి అన్నా జనసేనాని మాత్రమే సీఎం కావాలి. అందుకు పార్టీ బలపడాలి. అందుకు సేనాని కర్తవ్యం ఏమిటి అంటూ వచ్చిన మరో అక్షర సందేశాన్ని చదివి అర్ధం చేసికొని, అక్షర సత్యాన్ని ఆశీర్వదిస్తారని, అలానే సేనకు మద్దతుగా నిలుస్తారు అని భావిస్తూ…
Be the first to comment