
ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారిని సన్మానించిన చంద్రగిరి నియోజక వర్గ ఇంచార్జ్ శ్రీ దేవర మనోహర్ మరియు జనసేన నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిఎసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ లేపాక్షి భవనంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజక వర్గ ఇన్చార్జి శ్రీ దేవర మనోహర్ గారు మరియు నాయకులు విజయవాడలోని ప్రమాణ స్వీకారానికి విచ్చేసి పసుపులేటి హరి ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించారు.
ఈరోజు అనగా జూన్ రెండవ తేదీ జరిగిన ఈ ప్రమాణ స్వీకారo, మహోత్సవానికి జనసేన పార్టీ నాయకులు,విరామహిళలు కార్యకర్తలు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దేవర మనోహర్ మాట్లాడుతూ మా అధిష్టాన నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అదేవిధంగా ప్రజలకు తనదైన శైలిలో అండగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తారు అన్నారు, గత ప్రభుత్వంలో నాయకులు లాగా ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు , ఆప్తులను కూడా పెట్టుకోవడం మా నాయకుడి లక్ష్యం కాదని ,కూటమి ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ అభివృద్ధి పనులను ఆపడం ఎవరి వలన సాధ్యం కాదని తెలిపారు.
Be the first to comment