
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌కు అవకాశం
అమరావతి:టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్ ప్రెసిడెంట్)గా బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దాంతో, రేపటి నుంచి కడపలో ప్రారంభమయ్యే మహానాడులో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుని, ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు క్షణం తీరికలేకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి కీలక పనుల్లో ఆయన మునిగిపోయారు. ప్రభుత్వంలో అదుపు తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను లోకేష్ అప్పగించడం మంచిదన్న అభిప్రాయం అత్యధిక మందిలో ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్‌కు నూతన బాధ్యతలు అప్పగించే ప్రకటన మహానాడులో చేస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.
Be the first to comment