
సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు, ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, అనిరుధ్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలు సావిత్రీ బాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే గారి జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
Be the first to comment