
పర్యావరణ హితం కోరుకోవడం మానవ సహజం. భవిష్యత్ తరాలకు మనం అందించే గొప్ప కానుక.
ఈ బృహత్కార్యాన్ని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవిగారు పర్యావరణాన్ని కాపాడాలని గతంలోనే ఎన్నో సార్లు పిలుపునిచ్చారు.
ప్రకృతి కాపాడాలనే లక్ష్యం మనందరిలో ఊపిరిలూదాలనే భావనతో శ్రీ చిరంజీవిగారు ప్రతిచోటా మొక్కలు విరివిగా నాటాలని, వాతావరణ సమతుల్యం పాటించాలని పిలుపునిస్తున్నారు.
మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారి పుట్టినరోజును శుభసందర్భంగా భావిద్దాం .
ఆరోజు మన ఇల్లు, కాలనీ, వీధి, గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా మొక్కలు నాటుదాం. కాలుష్య నివారణలో భాగమవుదాం..కాలుష్యరహిత సమాజానికి పాటుపడుదాం. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం ..
జై చిరంజీవ… జై జై చిరంజీవా !!
అఖిల భారత చిరంజీవి యువత
Be the first to comment