
*అఖిలభారత చిరంజీవి యువత* పిలుపుమేరకు హైదరాబాదు లోని *చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ , Blood Bank & Eye Centre* లో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు *శ్రీ రవణం స్వామి నాయుడు* గారి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల మరియు జిల్లాల చిరంజీవి యువత అధ్యక్షులతో ఏర్పాటుచేసిన సమావేశంలో వినుకొండ నియోజకవర్గ *మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షులు* మరియు *జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్* గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రాబోయే కాలంలో సేవ కార్యక్రమాలు, విశ్వంభర సినిమా కి సంబంధించి మరియు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలకు సంబంధించి చెయ్యబోయే వివిధ కార్యక్రమాల మీద చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగశ్రీను రాయల్ గారు మాట్లాడుతూ తన ప్రస్థానం అన్నయ్య చిరంజీవి గారి అభిమాని గా మొదలై ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణం చిరంజీవి గారి స్పూర్తి అని, ఆయన నుండి కేవలం సినిమా అనే కాకుండా సేవా గుణం,ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం ఇలా ఎన్నో విషయాలు అన్నయ్యను చూస్తూ నేర్చుకున్న అని రాజకీయ అరంగేట్రం అన్నయ్య ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం నుండి మొదలైంది అని తెలియచేశారు. మాకు అతి పెద్ద పండగలు ప్రతి సంవత్సరం ఆగస్టు,22 మరియు సెప్టెంబర్,2 వ తేదీ అని ఆ తేదీలన మా వినుకొండ నియోజకవర్గ లో చిరంజీవి గారి మరియు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు గత 20 సంవత్సరాల పైగా నియోజకవర్గంలో బ్లడ్ క్యాంపులు, పులిహార పంపిణీ, మజ్జిగ పంపిణీ, పుస్తకాల పంపిణీ, పేదలకు ఆర్థిక సాయం, Specially Disabled Childrens పాఠశాలలో భోజనం పంపిణీ ఏర్పాటు చెయ్యడం, ప్రత్యేకంగా చిరంజీవి గారి 2023 పుట్టిన రోజున ఉచితంగా రెండు మార్చురీ ఏసీ Box లను నియోజకవర్గ ప్రజలు ఉచితంగా వినియోగించుకునేలా ఏర్పాటు చెయ్యడం జరిగింది అని తెలియ చేశారు. ఇవే కాకుండా రాష్ట్ర నాయకులు ఏ పిలుపు ఇచ్చిన మేము మా నియోజకవర్గం లో చెయ్యడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటాం అని అన్నారు. అఖిలభారత చిరంజీవి యువత జాతీయ మరియు పలు రాష్ట్రాల అధ్యక్ష,కార్యదర్శులు మార్చురీ ఏసీ బాక్సులు ఉచితంగా ఏర్పాటు చెయ్యడం గురించి నాగ శ్రీను రాయల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్వామి నాయుడు గారు రాబోయే రెండు పండగలు విశ్వంభర సినిమా మరియు అన్నయ్య చిరంజీవి గారు జన్మదినం సందర్భంగా చెయ్యబోయే కార్యక్రమాల గురించి దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు చింతామణి మహేష్ గారు, జాతీయ ఉపాధ్యక్షులు కొట్టే వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు, రవీంద్ర గారు, ఏడిద బాబీ గారు, ఆంధ్ర ,తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా,కేరళ మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు,కార్యదర్శులు పాల్గొన్నారు.
Be the first to comment