బలిజ భవన నిర్మాణ అభివృద్ధి కమిటీ.

బలిజ భవన నిర్మాణ అభివృద్ధి కమిటీ.

24/5/2025, సాయంత్రం నాలుగు గంటలకు మేము అందరం కలిసి బలిజ భవన స్థలoను సందర్శించటం జరిగింది. బలిజ భవనము గత కొన్ని సంవత్సరములగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం గమనించి దీన్ని మన కులస్తులందరి దృష్టికి తీసుకుని వచ్చే నిమిత్తం మేము గత 15 రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అసలు ఈ బలిజ భవన స్థలం కోసం నిర్మాణం కోసం చాలామంది నాయకులు పెద్దలు బాగా కృషి చేసి ప్రస్తుతానికి ఈ స్థలాన్ని ఈ స్థల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వారందరి కృషి ఫలితమే ఈరోజు ఈ స్థలం ఉంది అనటంలో సందేహం కూడా లేదు వారందరికీ ఈ భవన నిర్మాణ స్థలం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ గారి నాయకత్వము లో కూడా బలిజ భవన్ గురించి పనిచేయడం జరిగింది. వీరు ఆరోజు కృషి చేసిన ఫలితమే ఈరోజు మనకు లభించిన ఈ స్థలం. ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి ఎవరో ఒకరు మొదలు పెడితే కానీ ఏదో ఒక ఆరంభానికి ప్రారంభం కాదు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పెద్దలు నాయకులు తిరుపతిలోని ముఖ్యమైనటువంటి అందరికీ కూడా మా విన్నపం .ఎలాగైనా సరే బలిజ భవన నిర్మాణం జరగాలి మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఉద్దేశంతో మేము ఈ స్థలానికి వెళ్లి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ స్థలం ఎలా ఉంది అనే భాగంగా కొన్ని ఫొటోస్ కూడా మీకు ప్రదర్శించడం జరుగుతోంది పరిశీలించండి దీనికి అందరూ సహకరిస్తారని మనవి ఈ విషయం గా గౌరవనీయులు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గారిని కూడా కలిసి విన్నవించి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ బలిజ సోదరులందరినీ కోరుకుంటున్నాము.,

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*