
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం
బెల్టు షాపులు పై నందివాడ పోలీసుల దాడులు
కృష్ణ జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వర రావు పర్యవేక్షణలో నందివాడ ఎస్సై కే శ్రీనివాసు తమ సిబ్బందితో మండలం లోని ఇలపర్రు గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న రెండు బెల్టు షాపులపై దాడి చేసి ఒక్కొకరి వద్ద నుండి 19 మరియు 9 క్వార్టర్ బాటిళ్లను స్వాదీనం చేసి ఇద్దరి వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేశారు.
గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నందివాడ ఎస్‌ఐ శ్రీనివాసు హెచ్చరించారు.
Be the first to comment