ఇంకోసారి రచ్చ చేయొద్దు..మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్

ఇంకోసారి రచ్చ చేయొద్దు..మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్

రాచకొండ సీపీ
కార్యాలయంలో మంచు విష్ణు విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరసేపు విష్ణును విచారించిన సీపీ సుదీర్ బాబు విచారించారు. నాలుగు రోజులుగా మంచు కుటుంబ వివాదాలపై ఆరా తీసిన సీపీ ..మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు సీపీ. శాంతి భద్రతలు విఘాత కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ.

విచారణ సందర్భంగా మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తోంది. జల్ పల్లిలోని ఫాంహౌస్ లో తన ప్రైవేట్ సెక్యూరిటీ ని పంపించాలని విష్ణును ఆదేశించారు సీపీ. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు.

2024 డిసెంబర్ 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరు కావాలని రాచకొండ పోలీసులు ఆదేశించారు. పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన.. మోహన్ డిసెంబర్ 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. మరోవైపు సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఇవాళ (డిసెంబర్ 11) ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలను సీపీకి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సీపీకి రూ.లక్ష పూచికత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్.

పోలీసుల నోటీసులకు విష్ణు మాత్రం రెస్పాండ్ కాలేదు. అటు కోర్టును ఆశ్రయించలేదు.. ఇటు విచారణకు రాలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11న రాత్రి మంచు విష్ణు సీపీ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*