
సత్తెనపల్లి నియోజకవర్గం
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ కన్నా గారి కార్యాలయం నందు నిర్వహించిన ఆర్ అండ్ బి అధికారుల సమీక్షా సమావేశం
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
వైకాపా ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం
మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు
అభివృద్ధికి చిహ్నాలైనా రోడ్ల నిర్మాణం, ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడంపై ఆర్ అండ్ బి అధికారులు శ్రద్ధ చూపించాలని కన్నా లక్ష్మీనారాయణ గారు కోరారు.
ఆర్ అండ్ బి అతిథిగృహానికి కోటి నలభైరెండు లక్షలు, మరియు ముప్పాళ్ళ పీహెచ్సీ సెంటర్ కు యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు పనులను త్వరితగతిన చేయాలని అధికారులను ఆదేశించారు
ఆర్ అండ్ బి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఆర్ అండ్ బి శాఖ నుంచి మంజూరైన 6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి అన్నారు.
వచ్చే సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కల్వర్టుల నిర్మాణం, పీహెచ్సీల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు
Be the first to comment