రిజర్వేషన్ల అమలుపై కాపు ఐక్యవేదిక స్పష్టమైన వైఖరి / డిమాండ్‌

రిజర్వేషన్ల అమలుపై కాపు ఐక్యవేదిక స్పష్టమైన వైఖరి / డిమాండ్‌
 అటు బీసీ లకు గాని ఇటు ఓసీ లకు గాని ఇబ్బంది లేకుండా కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాల వారికి మహారాష్ట్రలో మరాఠాలకు అమలు చేస్తున్న మాదిరిగా 10% ప్రత్యేక రిజర్వేషన్‌ జనాభా ప్రాతిపదికగా అమలు చేయాలి.
 ఎ.పి.లో రిజర్వేషన్ల అమలులో సమధర్మాన్ని, సమన్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రభుత్వంవారు నిష్పక్షపాతంగా తల్లిదండ్రులపాత్ర పోషించాలి. జనాభా ప్రాతిపదికగా అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్ల అమలు విషయంలో ద్వంద్వ విధానాలను, ద్వంద్వ నీతిని సత్వరమే విడనాడాలి. నామినేటెడ్‌ పోస్టులలోనూ, నామినేటెడ్‌ వర్కులలోనూ, స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, విద్య, ఉద్యోగాలలోనూ ఒకేవిధమైన రిజర్వేషన్‌ విధానాన్ని యూనిఫామ్‌గా ఒకే రీతిలో అమలు చేయాలి. స్థానిక సంస్థలలో ఒక నీతి, విద్య, ఉద్యోగాలలో మరొక నీతి, బలమైన బి.సి. వర్గాలకొక నీతి, బలహీనమైన ఎం.బి.సి. వర్గాలకు మరొక నీతి, కాపులకు ఒక నీతి, బి.సి.లకు మరొక నీతి అనే విధంగా ద్వంద్వ నీతితోటి ప్రభుత్వం వారు ముందుకు వెళ్ళడాన్ని కాపు ఐకవేదిక పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. బి.సి.లకు విద్య ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా అమలు చేయాలని కాపు ఐక్యవేదిక పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం. అదే విధంగా కాపులు మినహా ఇతర పేద ఓ.సి.లకు -బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి… తదితరులలోని పేదలకు EWS 10% రిజర్వేషన్లు కొనసాగించాలని కాపు ఐక్యవేదిక పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం. EWS 10%లో కాపులకు 5% సబ్‌-కోటా / ప్రత్యేక కోటాను కాపు ఐక్యవేదిక పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
అనాది నుండి కాపులు సమాజహితం కోసం పనిచేసారు. ‘‘సమాజానికి కాపుకాసేవాడే కాపు’’. కాపులు అనాది నుండి నేటి వరకూ పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు, భవిష్యత్తులో కూడా పోషిస్తారు. పాలక పక్షాలవారు ఈ విషయాన్ని గమనించి రాజకీయంగా మీ ఓటు బ్యాంకును మరింత పదిల పరచుకునే విధంగా ముందుకు వెళ్ళాలని, మీ ఓటు బ్యాంకుకు నష్టం కలిగించే విధంగా గానీ, ఇతర సామాజికవర్గాల వారి ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా గానీ ఒక్క డిమాండ్‌ కూడా ప్రభుత్వం వారి ముందు మేము ఉంచలేదు అనే విషయాన్ని పాజిటివ్‌ కోణంలో గ్రహించి సమధర్మం, సమన్యాయం, సామాజికన్యాయం అందరికీ చేయాల్సిందిగా మిక్కిలి కోరుచున్నాం. అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా ఉండాలి అన్నదే మా విధానమని సవినయంగా ప్రభుత్వం వారికి విన్నవించుకొనుచున్నాము.
సామాజిక ఉద్యమాభివందనములతో….
తమ విశ్వసనీయ…
కాపు ఐక్యవేదిక.
స్థలం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా…
తేదీ : సమధర్మం, సమన్యాయం, సామాజికన్యాయం జరిగేంతవరకూ…
సెల్ : 9949249170

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*