కొడంగల్ ఫార్మ భూముల కేటాయింపు – నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

కొడంగల్ ఫార్మ భూముల కేటాయింపు – నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

 

కొడంగల్ ఫార్మ భూముల కేటాయింపు – నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు అనే అంశం పై గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్ గారి అధ్యక్షతన ఈరోజు 14/11/2024 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది..

* సేవాలాల్ సేన – LHPS – AIBSS – GVS – OU JAC & నిరుద్యోగ జేఏసీ సంఘాల సంయుక్త రౌండ్ టేబుల్ సమావేశం.

– ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ హాజరై మాట్లాడారు..

రేవంత్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకుబడ్డ గుగులోతు భీమా నాయక్.

మొన్న లగచర్ల అధికారుల పై జరిగిన దాడి ఎవరు ఊహించని పరిణామం దానిని ఖండిస్తున్నాం అని, కానీ ఫార్మ కంపెనీ పేరుతో లంబాడీల భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా లంబాడీల భూముల జోలికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు…….

– మిష్టర్ రేవంత్ రెడ్డి గారు మీ బిడ్డ కట్నానికి అల్లుడికి ఇవ్వాల్సిన భూమి, మా లంబాడీల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు జెండా కొడంగల్ లో ఎగెరెస్తాం అని హెచ్చరించారు…….

– లంబాడీల భూములు,లంబాడీల ప్రాణాలు – మానాలు అంటే నీకు అంత చులకనగా వుందా – ఎవడయ్య నువ్వు మా లంబాడీల భూములు గుంజుకోవడానికీ నీకు ఎవరు ఇచ్చారు ఆ అధికారం ……….!

* ఇది భూముల కోసం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన నేల ఇది – పోరాటం మాకు కొత్త కాదు జాగ్రత్త అంటూ హెచ్చరించారు…….

– 10 సంవత్సరాలు టిఆర్ఎస్ చేయని దోపిడీ కేవలం 10 నెల్లలో చేసేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం……..

– కాంగ్రెస్ పార్టీలో హక్కుల కోసం కొట్లడిన బెల్లయ్య నాయక్ – సీతక్క గార్లు ఎందుకు నోరు విప్పడం లేదు, మీరు రాజీనామా చేసి బయటికి రండి కలిసి కొట్లడుదాం అని భీమా నాయక్ అన్నారు……..

– కలెక్టర్ మీద దాడి జరగలేదని ఒప్పుకున్నారు, అయిన మీరు లంబాడీల పై కక్ష కట్టి జైలుకి పంపడం అంటే మీ గోతులు మీరే తీసుకుంటున్నారు అని మండిపడ్డారు ……..

– అరెస్ట్ చేసి జైలుకు పంపిన బాధితులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి – లంబాడి బిడ్డలను హింసించిన వారి పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి……..

– లంబాడీలకి లడాయి అంటే మామూలు విషయమే,భారత దేశంలో ఏ పోలీస్ స్టేషన్ లో వెళ్లిన లంబాడీల పైనే కేసులు ఎక్కువ వున్నాయి, కాబట్టి కేసులు కొత్త కావు తక్షణమే ఫార్మా కంపెనీల పేరుతో లంబాడీల పై అణిచివేతకు ఆపాలి…..

కేసీఆర్ కుటుంబ పాలన అన్న నువ్వు, మరి నువ్వు ఇవాళ చేస్తుంది ఎంటి ? ఎవరు తిరుపతి రెడ్డి?,ఎవరు కొండల్ రెడ్డి?,ఎవరు పుల్లారెడ్డి? ఎవరు ఇంకో రెడ్డి? అంటూ మండిపడ్డారు

ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో అతిరథ మహారథులు పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణ గారు, హై కోర్టు అడ్వకేట్ జోగురాం నాయక్,ప్రొఫెసర్ శంకర్ నాయక్, ఎల్ హెచ్ పీఎస్ (సమితి) రాష్ట్ర అధ్యక్షులు రంబాల్ నాయక్,నంగరభేరి రాష్ట్ర అధ్యక్షులు గణేష్ నాయక్,జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, ఓయు నెహ్రూ నాయక్,నిరుద్యోగ జేఏసీ మోతీలాల్ నాయక్,భాస్కర్ నాయక్,కృష్ణ నాయక్,రవి రాథోడ్,రాందాస్ నాయక్, సోము నాయక్, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు….

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*