
తెలుగు రాష్ట్రాల జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుల ఆత్మీయ సమావేశం
మన ఆరాధ్య దైవం *శ్రీ చిరంజీవిగారు నటించిన ‘విశ్వంభర’ సినిమా* త్వరలో విడుదల కాబోతున్న సందర్భం…
మరో మూడు నెలల్లో రాబోతున్న *మెగాస్టార్ జన్మదినం.*
రెండు పండుగల వేళ మన అశేష మెగాభిమానుల తరపున చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రణాళికలపై చర్చించేందుకు ..
తెలుగు రాష్ట్రాల జిల్లాల చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం *అఖిల భారత చిరంజీవి యువత*’ సంకల్పించిందని సంతోషంగా తెలియజేస్తున్నాం.
కావున, మెగా నాయకులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని.. చేపట్టబోయే కార్యక్రమాలకు సంసిద్ధం కావాలని కోరుతున్నాం.
స్థలం: హైదరాబాద్
తేదీ: 10-05-2025 శనివారం
@ 9.09Am
అఖిల భారత చిరంజీవి యువత
Be the first to comment