
జనసైనికులు ప్రజలకు చేయాల్సి మంచిని అధ్యయం చేయాలి
*జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ*
*నూతన సంవత్సర వేడుకలకు తరలివచ్చిన జనసైనికులు*
*నూతన సంవత్సర కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చరణ్‌తేజ*
చిలకలూరిపేట: జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు అధ్యయం చేసి వారి పరిష్కారానికి కృషి చేయాలని జనసేన పార్టీ యువ నాయకులు మండల నేని చరణ్ తేజ అన్నారు. బుధవారం నూతన సంవత్సరం సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు తెలపటానికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తరలి వచ్చారు. వారి సమక్షంలో నూతన సంవత్సర కేక్‌లను కట్ చేసిన చరణ్‌తేజ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఏడాదిలో ప్రజలు చేపట్టే ప్రతి పనికీ దేవుడు తోడుగా ఉండాలని, ఆయా పనుల్లో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
*జనసేనికులు పార్టీని బలోపేతం చేయాలి*
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రజలకు చేయాల్సిన మంచిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న సగటు ప్రజలకు సేవ చేయటానికి,వారికి అండగా నిలిచేలా పనిచేయాలని కోరారు. నేడు గెలుపుతో పొంగిపోలేదు.. పవన్ కల్యాణ్ నడిచింది రహదారి కాదు ముళ్లదారి. అలాంటి దారిలో నెగ్గి చూపించారని వెల్లడించారు. గెలుపుతో సరిపెట్టుకుండా ప్రజల హృదయాలు గెలిచారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల కాలంలోనే ప్రజా సంక్షేమాభివృద్ది పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది చెప్పారు జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామా, గ్రామానా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, జన సైనికులు, మండలనేని అభిమానులు పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Be the first to comment