సాక్షికి చట్టం అంటే ఏమిటో చూపిస్తా: ఏబీ వెంకటేశ్వరరావు

సాక్షికి చట్టం అంటే ఏమిటో చూపిస్తా: ఏబీ వెంకటేశ్వరరావు

సాక్షికి, ఓ యూట్యూబ్ చానల్‌కు చట్టం అంటే ఏమిటో చూపిస్తానని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదు. ఆరోపణలకు, కేసుకూ, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న సాక్షి దినపత్రిక తో పాటు…మరో యూట్యూబ్ ఛానల్ కు పరువునష్టం నోటీసులు పంపాను. నికార్సైన పోలీసుగా పనిచేసిన నేను చట్టంపై నమ్మకంతో చెపుతున్నాను…వీళ్లకు చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని హెచ్చరించారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనపై వచ్చిన ఆరోపణలపై కేసులు లేవని మొత్తం ఉపసంహరించుకుంది. ఇవన్నీ జగన్ హయాంలో పెట్టిన తప్పుడు కేసులని తేల్చింది. అయితే ఉపసంహరించుకోవడమే పెద్ద తప్పన్నట్లుగా కథనాలు వండి వారిస్తున్నారు. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉందని సాక్షితో పాటు ఓ యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేశారు. ఇది ఏబీవీకి కోపం తెప్పించింది. నా మీద పెట్టిన అక్రమ కేసులో అసలు ఫోన్ టాప్పింగ్ అనే అంశమే లేదనీ తెలుసని ఇయినా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

ఏబీవీ ఐదేళ్ల సర్వీసును జగన్ రెడ్డి వికృతానందం కోసం కోల్పోయారు. ఆయనను ఐదేళ్ల పాటు టార్చర్ పెట్టారు. దేశంలో అన్ని వ్యవస్థలను మాయచేశారు. చివరికి కారణం లేకుండా డిస్మిస్ చేయాలని సిఫారసు చేశారు. ఆయనను డిస్మిస్ చేస్తే ఇవాళ ఇప్పటికే స్పష్టమైన కారణాలతో పది మంది ఐపీఎస్‌లు, పది మంది ఐఏఎస్‌లు డిస్మిస్ అయి ఉండేవారన్న అభిప్రాయం. తనను తప్పుడు కేసుల్లో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీ కోరుతున్నారు కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*