
కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల ని మర్యాదపూర్వకంగా కలిశారు
ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం,గోమతినగర్ నందు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల ని మర్యాదపూర్వకంగా కలిశారు…
జన రంజకమైన పాలన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి,జనసేన పార్టీకి తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని,ఎటువంటి సహకారం కావాలన్నా బేషరతుగా మద్దతు తెలుపుతూ తమ సమస్యలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ దృష్టికి తీసుకు వస్తామని తెలియజేశారు.
ఏపీ కాట్వా సభ్యులు జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం నిజంగా సంతోషకరం…
ప్రజల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారి ఉన్నత ఆశయాల కోసం అందరం కలిసిమెలిసి పనిచేస్తాము,జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్న ఎవరైనా కూడా పార్టీ కార్యాలయానికి రావచ్చు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కాట్వా సభ్యులు డాక్టర్ గునుకుల శివ,అమ్మిశెట్టి హజరతయ్య, కత్తి శ్రీనివాసులు,శశిధర్, కొండేటి వెంకటేశ్వర్లు, అంకారావు, మాలకొండయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment