
*ఆప్త సభ్యులకు కుల బాంధవులకు అందరికీ పేరుపేరునా నా నమస్సులు..ఈరోజు ఇంతమంది కుల బంధువులు ఏకమై చేసుకుంటున్న వేడుక ఆర్థికంగా ఎదగాలని ఒకరికొకరు సహాయం అందించుకోవాలని కోరుకుంటున్న ఆప్త సమావేశం ఇది..*
*ఇన్ని రోజులు మా మిడిల్ క్లాస్ ఆడపడుచులకు గుడికి వెళ్లడం, పెళ్లిళ్లు ఫంక్షన్లకు వెళ్లడం, షాపింగ్ చేసుకోవడం వరకే తెలుసు.*
*ఎప్పుడైతే రాజకీయంగా వచ్చామో ఆర్థికంగా చిదిగిపోవడమో తెలుసు రాజకీయంగా రాజకీయం ఎలా చేయాలో తెలుసుకున్నాము* *రాజకీయపరంగా ఎన్నో అవమానాలు చూసాము వ్యాపారాలు చెయ్యనీయకుండా ఇలా చేశారో చూశాము*
*కులం పేరుతో అవమానించడం చూసాము*
*ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఏమైనా అనాలి అనుకుంటే మా అభివృద్ధిని ఎలా ఆపాలీ అనుకున్న మనుషులను చూసాము మా చుట్టూరు ఉన్న సమాజం అవమానించడం చూసాము*
*నేడు మేము రాజకీయం తెలుసుకున్నాము ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నాము విద్యాపరంగా మా ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలు చదివించాలి అనే పట్టుదలతో ఉన్నాము*
*ఆడపడుచులు ఎంత బలంగా ఉన్నారు అంటే ఎంత మానవత్వంగా ఆలోచిస్తున్నారు అంటే ఏ కుటుంబం అయితే ఆర్థికంగా సహాయం చేస్తే ఆ కుటుంబమంతా నిలుస్తుందో వారికి అండగా ఉండలీ అని ఏ ఇంట్లో విద్యా అందితే ఆ ఇల్లు నిలబడుతుందో వారికి విద్యకు సహకారం అందించండి అని ఇంట్లో ఆడపడుచులు చెబుతున్నారు*
*సమయాన్ని , తెలివితేటల్ని, సంపదని కులానికి అందించండి మీ సంపదలో ఐదు శాతం లేదా మీ శక్తి మేరకు కులానికి అందించాలి మీకు ఏ కొంచెం సమయం దొరికినా చరిత్రను మనకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రచారం చేయండి*
*చరిత్రను చెప్పాలి సత్యం ఎప్పుడు ప్రచారంలో ఉండాలి అని చెబుతున్నారు*
*మా మగవారు ఏ రంగంలో అడుగుపెట్టిన మేము తోడుంటాము అని చెబుతున్నారు*
*మనీ మీడియా మాఫియా ఉండాలని బలంగా చెప్తున్నారు*
*వందలో 27 ఉన్న మాకు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ సినీ స్టూడియోలోనూ మా యొక్క భాగస్వామ్యం ఉండాలి* *రాజకీయంగా ఎదుగుతున్న మా కులానికి మేము పూర్తిగా అండగా ఉంటాము అని చెప్తున్నారు*
*భారతదేశంలో రిజర్వేషన్ సాధించిన వ్యక్తి మహాత్మా పూలే మా కులానికి మేము రిజర్వేషన్ సాధించుకోవడం తెలవదా ?*
*రాజకీయంగా మార్పు తీసుకొచ్చిన మహానీయుడు మా పెరియర్ ఆత్మగౌరవంతో అన్ని సాధించుకోవచ్చు అని చెప్పిన మహనీయుడిని ఆదర్శం మాకు లేదా?*
*రాజకీయంగా ఎదగలేమా?*
*భారతదేశానికి చదువులు అందించిన తల్లి మా సావిత్రిబా పూలే మా బిడ్డలకి మేము చదువులు అందించలేమా?*
*విద్యాసంస్థలు పెట్టలేమా?*
*మహిళలు రాజకీయ రిజర్వేషన్లు 33% సాధించిన మా కాపు ఆడపడుచు మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి జ్యోతి దేవి గారు తెచ్చిన రాజకీయ రిజర్వేషన్లు లో మా ఆడపడుచులు రాజకీయంగా వస్తాము*
*ఇన్ని రోజులు మాకు చరిత్ర తెలియదు అందుకే మేము చరిత్ర సృష్టించలేకపోయాము నేడు మా చరిత్రను మహనీయుల తెలుసుకుంటున్నాం తెలుపుతాము చరిత్రను సృష్టిస్తాము..*
. *మా పిల్లలను అని రంగాల్లో ఉండేటట్టు మేము చేయగలము చేస్తాము*
*మనము ఏర్పాటు చేసుకున్న ఏ వేదికలైనా మన ఆడపడుచులు కనీసం వందలో 30 మంది అక్కడ వచ్చే విధంగా మన మగవారు చేయాలి లేదా మనం ఏర్పాటు చేసుకునే వేదిక 15 మందిలో కనీసం 8 అయిన మన ఆడవాళ్లు ఉండాలి*
*ఆడవారిని భాగస్వామ్యం ఎంత పెరుగుతే మనము అంత అభివృద్ధి*
*అన్ని రంగాలలో విజయం సాధించినట్టే*
*రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మన ఆడవారికి సహకరించండి*
*మనది పెంచే సాంస్కృతి కాల్చే సంస్కృతి కాదు అని గుర్తుపెట్టుకోండి ప్రకృతిని ప్రేమించే మన కులానికి సమాజానికి అండగా ఉంటుందని రానున్న భవిష్యత్ తరాల్ని మంచి మానవతా హృదయంతో ముందుకు తీసుకెళుతుందని నమ్ముతూ*
*” Progress of a society would be measured with the levels of education of the women.”*
*జై ఆప్త*
*ఏనుగుల సత్య చైతన్య రాయలు*
Be the first to comment