31, డిసెంబర్, 2024 పంచాంగం

31, డిసెంబర్, 2024 పంచాంగం

సూర్యోదయాస్తమయాలు:
ఉ 06.36 / సా 05.46
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు

స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః / పుష్యమాసం / శుక్లపక్షం

తిథి : పాడ్యమి రా 03.21 వరకు ఉపరి విదియ
వారం :మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : పూర్వాషాడ రా 12.03 వరకు ఉపరి ఉత్తరాషాఢ

యోగం  : ధృవ సా 06.59 వరకు ఉపరి వ్యాఘాత
కరణం : కింస్తుఘ్న సా 03.42 బవ రా 03.21 ఉపరి బాలువ

సాధారణ శుభ సమయాలు
మ 12.00 – 01.00 సా 04.00 – 06.00
అమృత కాలం  : రా 07.14 – 08.51
అభిజిత్ కాలం  : ప 11.48 – 12.33

వర్జ్యం : ఉ 09.36 – 11.12
దుర్ముహూర్తం : ఉ 08.50 – 09.34 రా 10.54 – 11.45
రాహు కాలం : మ 02.58 – 04.22
గుళికకాళం : మ 12.11 – 01.34
యమగండం : ఉ 09.23 – 10.47
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు
ప్రాతః కాలం    :  ఉ 06.36 – 08.50
సంగవ కాలం   :     08.50 – 11.04
మధ్యాహ్న కాలం :   11.04 – 01.18
అపరాహ్న కాలం : మ 01.18 – 03.32

ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ పాడ్యమి
సాయంకాలం  :  సా 03.32 – 05.46
ప్రదోష కాలం   :  సా 05.46 – 08.20
రాత్రి కాలం : రా 08.20 – 11.45
నిశీధి కాలం       :  రా 11.45 – 12.37
బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.53 – 05.45.

31-12-2024-మంగళవారం రాశి ఫలితాలు:

మేషం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పొటీపరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

వృషభం
వృత్తి, వ్యాపారాలలో కొంత మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి.

మిధునం
విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగులల్లో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

కర్కాటకం
ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగువుతాయి.

సింహం
వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది.

కన్య
ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం.

తుల
వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహయత్నాలు అనుకులిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ణకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.

వృశ్చికం
వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

ధనస్సు
వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు నుండి ఉపశనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మకరం
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి.

కుంభం
వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి వివాదాలుంటాయి. నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి.

మీనం
క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*