
బలిజ తెలగలకు సామాజిక న్యాయం కల్పించండి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన కాపు బలిజ తెలగలకు ” అధికారంలో భాగస్వామ్యం ” కల్పించి సామాజిక న్యాయం చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ కాపు బలిజ తెలగ మహాసభ ప్రభుత్యానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మునిసిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి ద్యారా వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ప్రతినిధి బృందంలో న్యాయవాది చెన్ను శివప్రసాద రావు, నెల్లూరు రాజరాజేశ్వరి దేవస్థానం చైర్మన్ గూడంశెట్టి దొరబాబు, వైవీ చక్రధర్, రమణారావు తదితరులు వున్నారు.
-ఆంధ్రప్రదేశ్ కాపు బలిజ తెలగ మహాసభ
Be the first to comment