
మహానాడులో నోరూరించే వంటకాలు
తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు ఆరంభమైంది. కడప గడప మొత్తం పసుపు మయమైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేశారు. ఏపీమంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి ఈ భోజన ఏర్పాట్ల బాధ్యతల్ని అప్పగించారు.. అలాగే ఈ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవితలు ఉన్నారు. మహానాడు ఫుడ్ మెనూపై చింతమనేని క్లారిటీ ఇచ్చారు. నోరూరించే వంటకాలను లిస్ట్‌లో చేర్చారు. 2 లక్షలమందికి భోజన ఏర్పాటు చేసినట్లు చింతమనేని తెలిపారు. మొదటి రోజు తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ మెయిన్ ఐటెమ్స్ సిద్ధం చేస్తున్నారు. రెండో రోజు అల్లూరయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉంటుందని.. మూడో రోజు బగారా రైస్, చికెన్ కర్రీతో మెనూ ఉంటుందన్నారు. మహానాడులో వెజ్, నాన్‌వెజ్ వంటకాలు ఉన్నాయి.
Be the first to comment