
- టీటీడీ బోర్డులో స్థానానికి
- గ్రేటర్ రాయలసీమ 6ఉమ్మడి జిల్లాల్లోని 40 లక్షల బలిజలకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించరా….
నూతన పాలక వర్గాన్ని పరిశీలిద్దాం….
చైర్మన్ కాకుండా 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TV5 ఓనర్ బొల్లినేని రాజగోపాల నాయుడు బోర్డు చైర్మన్‌గా, 24మందిని సభ్యులుగా నియమించారు .
టీటీడీ దేవస్థానానికి తరతరాలుగా సేవలు అందిస్తున్న స్థానిక రాయలసీమ బలిజలను విస్మరించి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో స్థానం కల్పించడం ధర్మామా….??
టీటీడీ బోర్డులో ఏపీ తర్వాత తెలంగాణకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు సైతం బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించడం ఏమి న్యాయమో అర్ధం కాదు…..జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఎంపీ స్థానంలో ఓడిపోయిన టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మికి బోర్డులో స్థానంతో ఓదార్పు కల్పించారు…
తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు నర్సిరెడ్డి,
నంద్యాల జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ రాజశేఖర్ , పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ వైసీపీ ఎమ్మెల్యే జంగా క్రిష్ణమూర్తికి అవకాశం ఇచ్చారు….
ఎన్నికల్లో క్రిష్ణమూర్తి గురజాల టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించి శాంత పరిచారు…..
మంగళగిరికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిని సభ్యురాలిగా నియమించి మంగళగిరిలో “లోకేష్ గెలుపు ” నకు సహకరించి నందుకు ఆమె, ఆమె సామాజిక వర్గానికి రుణం తీర్చుకున్నారు….
అలాగే జనసేన నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ సన్నిహితుడు, కళా దర్శకుడు ఆనంద్‌సాయికి బోర్డులో అవకాశం లభించింది.
ఇక వేల కోట్లకు అధిపతులైన కోటేశ్వరులు జాస్తి సాంబశివరావు,నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లాకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించి వారి కళ్ళలో భక్తి, ఆనందం నింపారు…….
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది…
కాఫీ వ్యాపారి ఆర్‌ఎన్ దర్శన్, కుప్పం పారిశ్రామిక వేత్త శాంతరామ్, చెన్నైకి చెందిన పి.రామ్మూర్తిని సభ్యులుగా నియమించి వారి గత సేవలకు రుణం తీర్చుకున్నారు….. కర్ణాటక నుంచి నరేష్ కుమార్‌కు చోటు కల్పించారు.
ఆర్థిక నిపుణుడు, నిధుల సమీకరణలో అనుభవం ఉన్న సౌరబ్ హెచ్.బోరాకు బోర్డు సభ్యుడిగా స్థానం దక్కింది. గతంలో ఎంసీఐ చైర్మన్‌గా విధులు నిర్వహించి సిబిఐ దాడులకు గురై అనేక వివాదాలకు మూల కారకుడైన డాక్టర్ కేతన్ దేశాయ్ తన కుమారుడు డాక్టర్ అదిత్ దేశాయ్‌కు స్థానం కల్పించే విధంగా చూసుకుని దేవుడి పై భక్తి చాటారు…
బలిజల ఓట్లతో గెలిచి బలిజలనే బలిపశువులను చేయడం ధర్మమా…??
Be the first to comment