
ఎన్నికలు జరక్క.. అభివృద్ధిలో వెనకబడుతున్న రాజానగరం
–10 విలీన గ్రామాలకు ఎన్నికల నిర్వహించాలి
–ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
–ఐదేళ్ల వైసీపీ పాలనలో పీఏసీల్లో భారీగా స్కాములు
–స్కాములు నివారించాలంటే ఎన్నికల నిర్వహించాలి
-ఖాళీ అయిన జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచుల పదవులకు ఎన్నికల నిర్వహించాలి
రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని>>ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 10 గ్రామాలకు విలీనం పేరుతో ఎన్నో ఏళ్లుగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయాయి అన్నారు. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు కాక.. అటు ఎన్నికలు జరగక.. అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. దీనివల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణం విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచుల పదవులు ఖాళీగా ఉన్నాయని.. కొంతమంది రాజీనామాలు చేయడం వల్ల, మరి కొంతమంది మరణించడం వల్ల ఈ పదవుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి అన్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచుల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. ప్రాథమిక సహకార సంఘాలకు గత వైసిపి ప్రభుత్వం ఎన్నికల నిర్వహించకుండా నిర్వీర్యం చేసిందన్నారు. దీనివల్ల ఆయా సంఘాల్లో భారీ ఎత్తున అవినీతి పెరిగిపోయిందని… నామినేటెడ్ పోస్టుల వల్ల ఆ సంఘాలు స్కాములకు నిలయంగా మారాయి అన్నారు. వెంటనే ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Be the first to comment