
అనంత జనసేనాని శ్రీ టిసి వరుణ్ అహుడ చైర్మన్ ఇవ్వడం హర్షనీయం:-
గుంతకల్ నియోజకవర్గం జనసేన నేత శ్రీ వాసగిరి మణికంఠ గారు
గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాద్యుడు శ్రీ వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ పదవి శ్రీ టిసి వరుణ్ గారికి కేటాయించడం హర్షనీయమని నవసమాజ నిర్మాణానికి నడుంబిగించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా 15 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినా ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ గారిని గుర్తించి అహుడా చైర్మన్ పదవిని ఇవ్వడం శుభ పరిణామం పేర్కొన్నారు.
యువ నాయకుడిగా ప్రజా రాజ్యం పార్టీలో అడుగుపెట్టి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2019 ఎన్నికలలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయిన కృంగిపోకుండా తర్వాత 2024 ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసావహిస్తూ కూటమి విజయానికి దోహదపడి… మరి ముఖ్యంగా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఎన్నో కష్టనష్టాలను భరించి, మరి వాటిని అధికమించి ఈరోజు అహుడా చైర్మన్ గా ఎన్నికవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యంగా ఈనెల 14వ తారీఖున ఉదయం 10:30 గంటలకు గుత్తి బాటలో సుంకులమ్మ ఆలయం నుండి వయా గుత్తి పట్టణం మీదుగా అనంతపురం పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలుగుదేశం, బిజెపి, జనసేన కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు శ్రీ పోతురాజుల చిన్న వెంకటేశులు, శ్రీ పాటిల్ సురేష్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడుశ్రీ పవర్ శేఖర్ గుత్తి సీనియర్ నాయకులు శ్రీ నాగయ్య రాయల్, శ్రీ అశ్వ నాగప్ప, శ్రీ అఖండు భాష, శ్రీ ధను, శ్రీ మిద్దె ఓబులేసు, శ్రీ హసన్, శ్రీ ఒబిచర్ల రమేష్ గుంతకల్ నాయకులు కసాపురం శ్రీ నంద, శ్రీ గాజుల రాఘవేంద్ర, శ్రీ సుబ్బయ్య, శ్రీ అమర్, శ్రీ సుంకర నాగరాజు, శ్రీ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment