
గురువు విలువ తెలిసినోడు..
గురువుల విలువ తెలిసినోడు
గురుతర బాధ్యత వహిస్తాడు
జ్ఞాన దానము చేసే గురువులను నమస్కరిస్తూ
బావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచాడు..
చదువు విలువ తెలిసినోడు
పిల్లలకు జ్ఞానం బోధిస్తాడు
గురువు యొక్క గొప్పతనం తెలుపూ
విద్యార్థులకు వారి విలువ తెలియజేస్తాడు…
గురువులను హీరోలతో పోల్చినోడు
పిల్లల హృదయాలలో చెరగని ముద్ర వేశాడు
తల్లిదండ్రుల తరువాత వారి స్థానం పదిలం
తరగతి గదిలో వాళ్లే హీరోలని అని చెప్పాడు..
సాహిత్యం తెలిసినోడు
సమాజంపై అవగాహన ఉంటుంది
నిరంతర పుస్తక అధ్యాయానం
జ్ఞాన సంపాదనలో నిండైన హృదయం..
ఆకలి తెలిసినోడు
పదిమందికి అన్నం పెడతాడు
ఉన్న దాంట్లో నలుగురికి పంచుతూ
తన సంపాదనను సైతం అర్పిస్తాడు….
కన్నీళ్ళ విలువలు తెలిసినోడు
కన్నీళ్లను తుడిచేందుకు ముందుంటాడు
కష్టమైనా నష్టమైనా తోడుగా నిలిచి
ప్రజాసేవలో నిత్యం ప్రజల కోసం శ్రమిస్తాడు.
అందుకే అంటారు పెద్దలు
విషయమున్నోడు అధికారిగా ఉంటే
ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది
ప్రజాస్వామ్యం నిత్యం వర్ధిల్లుతుంది..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
Be the first to comment