జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జనవాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన ప్రజానీకం

పలు సమస్యలను వినతుల రూపంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి అందజేసిన ప్రజలు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమాన్నికోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు కోరుకొండ మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.

గత ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి భారీగా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగిన ఇల్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వీధి లైట్లు వంటి సమస్యలతో ప్రజలు వినతి పత్రాలు అందించారు. వీటితోపాటు పంటలు దెబ్బతిన్న రైతులు, రోడ్లు డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి అందించారు…

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*