అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్

అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ పదవి వరించిన శ్రీ TC వరుణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు .

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికిన *శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్*గారి పిలుపే శంఖారావంగా భావించి…

యువ నాయకుడిగా ప్రజా రాజ్యం పార్టీలో అడుగిడి…

రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీ టిసి వరుణ్ ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను అవపోసన పట్టి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా దశాబ్ద కాలానికి పైగా పార్టీని ఏకతాటిపై నడిపిన యువ నేతను గుర్తించడం శుభ పరిణామం.

జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయంతో 2019 అనంతపురం అర్బన్ నియోజకవర్గ బరిలో నిలిచిన వరుణ్ 2024 ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసా వహిస్తూ.. కూటమి అభ్యర్థి విజయానికి జన సైనికులను కార్యోన్ముఖులను చేశారు.

ఎన్నో కష్టాలను,నష్టాలను భరించి.. అవరోధాలను అధిగమించి..

శ్రీ పవన్ కళ్యాణ్ లోని స్థిత ప్రజ్ఞతను పునికిపుచ్చుకున్న శ్రీ టిసి వరుణ్ గారికి అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి వరించిన శుభసందర్భంగా శ్రీ టి సి వరుణ్ గారికి హృదయపూర్వక అభినందనలు.

ఇలాంటి ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి, ఆ పదవులకే వన్నె తీసుకొస్తారని మనసారా అభిలాషిస్తూ…

ఇవే మా శుభాకాంక్షలు ..

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*