ఏపీలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరకరమైన సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్‌ల కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతుండగా.. పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే ఉన్నారు.అయితే తాజాగా సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపైనా కేసు నమోదైంది.. ఒకే రోజు రెండు జిల్లాల్లో పోలీసులు కేసులు ఫైల్ చేశారు.
. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసుల కూడా రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీం రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు. వర్మ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా.. తుళ్లూరు పోలీసుల వర్మపై కేసు నమోదు చేశారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*