
సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉన్నట్లా లేనట్లా???
పార్టీకి చెందిన ఒక నాయకుడి పై దాడి జరిగితే ఎక్కడా కూడా ఖండన లేదేమిటి???
జిల్లా పదవి ఉన్న నాయకుడికి ఖండన లేకపోతే మరి కార్యకర్త పరిస్థితి ఏమిటి???
న్యాయవాదులు ఖండించారు తప్ప మరి పార్టీ నాయకుల పరిస్థితి ఏమిటి???
సత్తెనపల్లి నియోజకవర్గంలో కొమ్మిశెట్టి సాంబశివరావు ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఒక న్యాయవాదిగా ఒక భారతదేశ పౌరుడిగా ఒక పార్టీ నాయకుడిగా సమాజంలో జరిగే అవినీతిని ఎండగడుతూ తప్పునీ తప్పు అని చెప్పే ఒకే ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. తప్పు అని చెప్పటమే ఈరోజు దాడికి కారణం అని చెప్పుకోవచ్చా అసలు దాడి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది పక్కన పెడితే కోడెల శివప్రసాద్ దగ్గర నుండి మొదలు అంబటి రాంబాబు వరకు… అంబటి రాంబాబు మొదలు కన్నా లక్ష్మి నారాయణ వరకు ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో నియోజకవర్గంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా కొమ్మిశెట్టి ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ద్వారా పనిచేసే విషయంలో కొంతమందికి ఆయన ప్రవర్తన నచ్చొచ్చు కొంతమందికి ప్రవర్తన నచ్చకపోవచ్చు కానీ ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు కచ్చితంగా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని సపోర్టుగా ఉండాలని లేదా ఈ విషయాన్ని ఆయనకు చెప్పే విధంగా పని చేయాలని లేదా అధిష్టానం దృష్టి కన్నా తీసుకొని వెళ్లాలని స్థానికంగా ఉండే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకపక్క దాడి జరిగింది అంటూ ఎంతోమంది నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి కొమ్మిశెట్టిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఖండించలేదు. అంటే పార్టీ అండగా ఉంది అని చెప్పుకోవచ్చా లేదు అని చెప్పుకోవచ్చా అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పుకోవచ్చా…. మరి దాడి జరిగినా ఏ ఒక్కరు కూడా ఖండించని ఇంకా అదే పార్టీలో సదరు వ్యక్తి కొనసాగుతున్నారు అంటే ఆయనకు ఆ పార్టీ మీద ప్రేమ ఉంది అని చెప్పుకోవచ్చా…. నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం వ్యక్తులు కూడా ఒక్కరు కూడా ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటే రేపు ఇదే నియోజకవర్గంలో ఉన్న ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మరో వ్యక్తిపై కూడా దాడి జరిగితే ఇలానే ఉంటారా అనే విషయాన్ని కూడా ఆ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు దృష్టిలో ఉంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత 15 సంవత్సరాల కాలం నుంచి నియోజకవర్గం లో ఏ ఒక్క రోజు కూడా న్యాయవాదులపై ఏ ఒక్క దాడి కూడా జరగలేదు కానీ ఈ దాడి ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో సదరు పార్టీ నాయకులు ఆ సామాజిక వర్గం కూడా దృష్టిలో పెట్టుకోవాలని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
Be the first to comment