
నేడు ఏపీలో అతి భారీ వర్షాలు: IMD
నేడు ఏపీలో అతి భారీ వర్షాలు: IMD
ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం స్టార్ట్ అయ్యింది. ఉదయం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురుస్తోంది. రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు స్థాయిలో ప్రారంభమై, ఆ తర్వాత భారీ వర్షాలుగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని IMD వెల్లడించింది.
Be the first to comment