ఏపీ రాష్ట్ర జై కాపుసేన ప్రధాన కార్యదర్శిగా మొహమాటం అనిల్ కుమార్ నియామకం.

ఏపీ రాష్ట్ర జై కాపుసేన ప్రధాన కార్యదర్శిగా మొహమాటం అనిల్ కుమార్ నియామకం.

మంగళగిరి:ఏపీ రాష్ట్ర జై కాపుసేన ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి యర్రబాలెం కు చెందిన మొహమాటం అనిల్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు శుక్రవారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో జై కాపుసేన వ్యవస్థాపక అధ్యక్షులు బసవ చిన్నబాబు చేతుల మీదుగా అనిల్ కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో
జై కాపుసేన వ్యవస్థాపక అధ్యక్షులు బసవ చినబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేద కాపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, కాపులకు విద్య, వైద్యం ఉచితంగా అందించి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం జరిగేలా కృషి చేయాలన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.వెంటనే కాపు కార్పోరేషన్ కు డైరెక్టర్ లను కూడా నియమించి కాపు రుణాల మంజూరు వారి ద్వారా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను జై కాపుసేన తరపున కలిసి కాపు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర జై కాపుసేన వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి కొండలరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపుల హక్కులు, రిజర్వేషన్ల అమలు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.జై కాపుసేన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన కాపు సామాజికవర్గం అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర జై కాపుసేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తిరుమలశెట్టి కొండలరావు తో కలిసి అనేక కాపు అభివృధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని నా మీద నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించిన రాష్ట్ర జై కాపుసేన వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నబాబు కు మరియు జై కాపుసేన నాయకులకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ జై కాపుసేన రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్న బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మెట వెంకన్న బాబు, చిట్టూరి రవీందర్, మేడేపల్లి కనక రామకృష్ణ , లీగల్ సెల్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎడ్లపల్లి దానారావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు అన్నదాసు శ్రీనివాసరావు, జిల్లా యువజన అధ్యక్షులు సోమరాజు సాంబశివరావు, గుంటూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వామన పల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*