
సీనియర్ జర్నలిస్ట్ సత్తి బాలకృష్ణనును పరామర్శించిన ముద్రగడ గిరిబాబు
అన్నవరం ఫాస్ట్ న్యూస్ :-ప్రముఖ గాంధీయవాది, ది ఈస్టు గోదావరి ఖాదీ రూరల్ డెవలప్ మెంట్ సంస్థ మాజీ మేనేజర్ సత్తి పశుపతి రావు(90) ఇటీవల మృతి చెందటంతో ఈ సందర్భంగా పశుపతి రావు తనయుడు అన్నవరం లే ఔట్ లో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సత్తి బాలకృష్ణ మూర్తి ని బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు స్థానిక పార్టీ నాయులతో వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా నాన్నగారు పశుపతి రావు ప్రధానంగా ముద్రగడ పద్మనాభం,ఆకుల రామకృష్ణ లతో ఆప్యాయంగా ఉండేవారని, అలాగే ప్రముఖ దివంగత కోనసీమ కాపు నాయుకులు ఆర్.వి.సుబ్బారావు,నల్లా సూర్య చంద్రరావు, సలాది స్వామి నాయుడు తదితరులు తో ఉన్న చనువు గా ఉన్న అనుబంధాలను ముద్రగడ గిరిబాబు కు సవివరంగా వివరించారు. స్థానిక నాయకులు సరమర్ల మధుబాబు, నరాల శ్రీనివాస్, గణేషుల బాబ్జి, న్యాయవాది రాయి శ్రీనివాసరావు, సుధీప్ లు కూడా పరామర్శించారు.
Be the first to comment