
చిరంజీవిని కలిసిన కా సినిమా యూనిట్
‘క’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. క చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఆదివారం తన నివాసంలో వారిని ప్రత్యేకంగా కలిశారు. సుజీత్, సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటులను ప్రశంసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ అబ్బవరం తాజాగా ఎక్స్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
“బాస్ నుంచి ప్రశంసలు. దాదాపు గంటపాటు మాకోసం సమయాన్ని కేటాయించి.. ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్యూ చిరంజీవి గారు. ఈ భేటీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది” అని పేర్కొన్నారు.
Be the first to comment