
పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లు ను నిషేధించిన భారత్
హైదరాబాద్:-పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు పడింది.
జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలు పాకిస్థానీయుల ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమా చారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లకు సందేశం పంపించింది.
నిషేధించిన ఛానెల్స్‌లో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థలతో పాటు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు చెందిన ‘100mph’ ఛానెల్‌పై కూడా నిషేధం పడింది.
భారత సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు సమాచారం, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాక్‌కు చెందిన 16 యూబ్యూట్ ఛానళ్లపై నిషేధం విధించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపి వేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది.
ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళ వారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
Be the first to comment