
కాల్ మాట్లాడుతుండగా కట్ అవుతుండడం (call drop) సెల్‌ఫోన్ వినియోగదారుల నుంచి తరచూ వచ్చే ఫిర్యాదు. నెట్‌వర్క్ రద్దీ, మౌలిక సదుపాయాల కొరత, పేలవమైన సిగ్నల్ తదితర కారణాలతో కాల్స్ కట్టవుతుండటంతో టెలికాం కంపెనీలపై యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తుండడంతో కేంద్ర టెలికాం శాఖ (Telecom Ministry) చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి ఈ సమస్యను ప్రతి నెల సమీక్షించనున్నట్లు ఆ శాఖ తెలిపింది. ప్రస్తుతం మూడు నెలలకోసారి సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా కాల్ క్వాలిటీ చెక్.. మునుపటిలా టవర్ వద్ద కాకుండా స్మార్ట్‌ఫోన్ వద్దే చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. కనెక్టివిటీని పెంపొందించేందుకు కొత్తగా దేశవ్యాప్తంగా 26వేల గ్రామాలకు సేవలందేలా 27 వేల టవర్లను నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
మరోవైపు ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న మోసాల కట్టడికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ)ను ఏర్పాటు చేసింది.
Be the first to comment