
శ్రీకృష్ణదేవరాయలు వారంటే పరిపాలన దక్షుడే కాదు.. సకల కళా వల్లభుడు
-వారు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమే
-దేవాలయాల అభివృద్ధిలో చూపిన కళ ప్రపంచ స్థాయిలో నిలిచింది
-మహనీయుల నుండి చూడాల్సింది కులమో మతమో కాదు.. వారు సాధించిన ఘన కీర్తి
-కోటప్పకొండలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో..నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
గొప్ప ఘన కీర్తిని సాధించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అంటే యుద్ధ వీరుడు, పరిపాలన దక్షుడే కాదు.. సకల కళా వల్లభుడు అని.. ఆయన ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కోటప్పకొండ వద్ద, శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్, కాపు అన్నదాన సత్రం వారు ఏర్పాటుచేసిన.. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. దేవాలయాల అభివృద్ధిలోశ్రీకృష్ణదేవరాయలు వారు చూపిన కళ ప్రపంచ స్థాయిలో నిలిచిపోయిందన్నారు. తిరుపతి, శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందింది శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనే అని పేర్కొన్నారు. హంపిని ఢీకొట్టే కళా ప్రపంచంలోనే లేదనేది ఒక నానుడి అని పేర్కొన్నారు. కవి హృదయం కూడా ఉందని అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి పేరును తనకు పెట్టడానికి గల కారణం.. వారిలోని కలలు సిద్ధించాలని తన తండ్రి ఏరి కోరి ఈ పేరును పెట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చేయడంలో కూడా ఆయనకు ప్రత్యేక ముద్ర ఉందని, చెరువులు కాలువలు తీయడంలో.. ఆయన చూపిన పనితనం ఇప్పటికీ చెరగనిదని అన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. మహనీయులు, నాయకులు నుండి చూడాల్సింది.. ఒక కులమో, మతమో కాదని.. వారు సాధించిన ఘన కీర్తి, పనితీరు అని పేర్కొన్నారు. అదే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఘనంగా సన్మానించారు.
Be the first to comment