
జగన్ రెడ్డి పాపం పండినట్టే, గౌతమ్ రెడ్డి పాపం కూడా పండింది.
తన సైకో బాస్ ఆర్గనైజ్డ్ క్రైంతో బాబాయ్ ని వేసేసిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని, రూ.24లక్షల సుపారీ ఇచ్చి విజయవాడలో బ్రాహ్మణుడుని చంపేయాలని ప్లాన్ చేసాడు, జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు, గౌతమ్ రెడ్డి. బెజవాడలో స్థలం కబ్జా చేసి యజమాని ఉమామహేశ్వర శాస్త్రిని చంపేందుకు రూ.24లక్షల సుపారీ ఇచ్చాడు గౌతమ్‌రెడ్డి. ఆర్గనైజ్డ్ క్రైంని పోలీసులు పసిగట్టి సుపారీ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న గౌతమ్‌రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గౌతమ్ రెడ్డి పై 43 కేసులు ఉన్నాయి. గతంలో రౌడీ షీట్ కూడా ఉంది. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే, రౌడీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పధకంలో భాగంగా, రౌడీ షీట్ ఎత్తేశాడు. ఇలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న గౌతమ్‌రెడ్డిని , జగన్ రెడ్డి గుర్తించాడు. ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ ని చేసాడు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించాడు. ఇప్పుడు జగన్ రెడ్డి పాపం పండినట్టే, గౌతమ్ రెడ్డి పాపం కూడా పండింది.
Be the first to comment