
ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
ఏపీలో ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈనెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్, 8న పీఎం సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Be the first to comment