
2024కి గానూ జిఎస్టి వసూళ్లలో తెలంగాణలో 10% వృద్ధి.. ఏపీలో 6% తగ్గుదల
డిసెంబరు నెల GST వసూళ్లు 2023తో పోల్చితే.. 2024లో తెలంగాణలో 10%పెరగ్గా, APలో 6% తగ్గాయి. కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణ వసూళ్లు 2023 డిసెంబరుతో పోలిస్తే 2024 డిసెంబరులో రూ.4,753 కోట్ల నుంచి రూ.5,224 కోట్లకు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ వసూళ్లు రూ.3,545 కోట్ల నుంచి రూ.3,315 కోట్లకు తగ్గాయి.
Be the first to comment