మనం సంఘాలు పెట్టి ఏం చేస్తున్నావ్ అనేది ముందుగా ఆలోచించండి

మనం సంఘాలు పెట్టి ఏం చేస్తున్నావ్ అనేది ముందుగా ఆలోచించండి

గౌరవనీయులైన కాపు తెలగ బలిజ సోదరులకు నమస్కారాలు మనం సంఘాలు పెట్టి ఏం చేస్తున్నావ్ అనేది ముందుగా ఆలోచించండి వైట్ అండ్ వైట్ వేసుకోవడం ఎమ్మెల్యే దగ్గర ఫోటో దిగటం ఎంపీ దగ్గరికి వెళ్తాం ఫోటో దిగటం మినిస్టర్ దగ్గరికి ఫోటో దిగటం ఈ ఫోటోలు దిగిన సంఘ నాయకులు మన కుటుంబంలో ఉన్న ఒక పేదవాడికి అమినిస్టర్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా సాయం చేయగలుగుతున్నామా ఈ రోజుల్లో ఒక పేద కుటుంబీకుడు తెలగబిడ్డ గుంటూరు రూరల్ ఉంటారు ఆరోగ్యం బాగోక ఎంపీ చుట్టూ తిరిగి సీఎం ఫండ్ ఏమీ సాధించలేకపోయారు ఈ ఫోటో దిగిన సంఘం నాయకులు ఆలోచించండి గత ప్రభుత్వంలో మనకి అవసరమైన లోన్లు అభివృద్ధి చెందే ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు పనులు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని ఎంతో ఆశ పెట్టుకున్నాం మనం ఎదగాలన్న అభివృద్ధి చెందాలన్నా విద్యా వైద్యమే మన యొక్క లక్ష్యం వీటి గురించి ఆలోచించి అలాగే నిరుద్యోగి యువతకు ఉద్యోగ సమాచారం తెలిపి ఒక మంచి భవిష్యత్తును మనం అందించగలిగే ప్రయత్నం చేయగలిగితే మన సంఘాలు ముందుకు నడవడానికి ఆస్కారం ఉంటుంది కాపు జేఏసీలు ఈ యొక్క 13 జిల్లాలలో 20 కాపు జేఏసీలు ఉన్నాయి ఏ కాపు జేఏసీ కూడా ఒక్క ఆఫీసు నిర్వహించే స్థాయిలో ఉండరు కేవలం విజిటింగ్ కార్డులు కొట్టించుకోవడం వైట్ అండ్ వైట్ వేసుకోవడం ఒక కారుని ఉపయోగించుకుని మీడియాతో మాట్లాడటం ఇవి తప్పితే మనలో పేద విద్యార్థులు అలాగే పేద కుటుంబాలకు వైద్యం ఈ ప్రభుత్వం ద్వారా మనకు రావలసిన అవసరం అయిన సీఎం రిలీఫ్ ఫండ్ రాబట్టే విధంగా చేయగలిగితే రాబోయే రోజులలో సంఘానికి ఒక విలువ ఉంటుంది మన మీటింగ్ పెడితే జనాలు రావటం భోజనం చేయడం ఇది సహజం కానీ మన సంఘం వల్ల మనము ఏమి చేశాం దూర దృష్టితో ఆలోచించండి ప్రతి ఒక్క సంఘ నాయకుడుకు నేను చెప్పేది ఒకటే మద్యాన్ని సేవించకండి మద్యం తాగే ఏ వ్యక్తి అయినా సంఘ నాయకుడు కాలేడు మన కాపు జాతిలో వేల కుటుంబాలు నాశనం అయిపోయినాయి మద్యం ద్వారా ఈ ఒక్క విషయాన్ని మన సోదరులందరూ గ్రహించి సంఘాలు ముందుకు నడవాలి ఫోటోలే ప్రాతినిధ్యం కాదు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే మద్యం అనే మహమ్మారి మన ఆలోచన విధానాన్ని నశింపజేస్తుంది మన కులుస్తుల్ని మద్యం తాగకూడదని మనము అవేర్నెస్ చేయగలిగే ప్రయత్నం చేస్తూ ముందుకు నడవాలని ఆశిస్తూ ….. ఇట్లు
బూర్లే నారాయణరావు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*