
పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, కొర్రపత్తి గ్రామం ఎం.పి.పి. స్కూల్ ను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
బల్లగరువు గ్రామంలో రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం, అనంతరం ఏర్పాటు చేసిన సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్, దారిలో కొర్రపత్తి స్కూల్ కు వెళ్లి అక్కడి చిన్నారులతో, సిబ్బందితో మాట్లాడారు. శిథిలావస్థ దశలో ఉన్న పాఠశాల స్లాబ్, ప్రహరీ గోడ వంటి పనులు చేయాల్సి ఉందని తెలపగా, తన ట్రస్ట్ నుంచి చేయిస్తానని మాటిచ్చారు.
అదే విధంగా అక్కడ అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ , ఆ ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధుల నుండి అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు.
ప్రజల కోసం* PK *పవన్ కళ్యాణ్*
Be the first to comment