
భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది
భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది. డోక్లాం సమీపంలో జోరుగా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తూ కవ్విస్తోంది. గత ఎనిమిదేళ్ల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆ వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో 22 గ్రామాలు, జనావాసాలను ఏర్పాటు చేసింది. 2020 నుంచి ఇప్పటి వరకు అక్కడ 8 గ్రామాలు నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ గ్రామాలను డోక్లాం సమీపంలో భూటాన్ భూభాగంలోని పశ్చిమ ప్రాంతంలో కడుతున్న చైనా.. ఆ భూమి తమదేనంటూ చెప్పుకుంటోంది. ఈ గ్రామాలు భూటాన్ పశ్చిమ భాగంలోనే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, 2017లో డోక్లాం సరిహద్దులో చైనా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో భారత్ అడ్డుకుంది. అప్పుడు ఇరు పక్షాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యూహాత్మక పీఠభూమిలో భారత్ సరిహద్దువైపు చొచ్చుకురావడానికి చైనా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా భూటాన్ భూగాన్ని ఆక్రమించి గ్రామాలు నిర్మిస్తూ తన ప్రజలను అక్కడకి తరలిస్తోంది.
Be the first to comment