
ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారు…
అనంతపురము పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారము ఎంపీ గారి నివాసంలో అహుడా చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సి.వరుణ్ గారు, శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురము పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో తన గళం వినిపిస్తూ పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు. ప్రజల మనిషి అయిన శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని శ్రీ టీ.సి.వరుణ్ గారు అభిలాషించారు. అదేవిధంగా నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు గారు బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అంకె ఈశ్వరయ్య, యువ నాయకులు శ్రీ చైతన్య కృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీ ఇండ్ల కిరణ్ కుమార్, శ్రీ సిద్దు, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ అవుకు విజయ్ కుమార్, నగర కార్యదర్శి శ్రీ కుమ్మర మురళి, నాయకులు శ్రీ సాయి, శ్రీ హిదాయత్, శ్రీ ఉదయ్, శ్రీ వంశి తదితరులు పాల్గొన్నారు
Be the first to comment