లక్కీ భాస్కర్ సినిమా చూశారా

లక్కీ భాస్కర్ సినిమా చూశారా

లక్కీ భాస్కర్ సినిమా చూశారా? చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి . Netflix లో ఉంది . మొట్టమొదటగా అభినందించ వలసింది దర్శకుడు వెంకీ అట్లూరిని . కధని , స్క్రీన్ ప్లేని చాలా బిర్రుగా తయారు చేసుకున్నారు . అంతే పకడ్బందీగా దర్శకత్వాన్ని కూడా చేసాడు . ఏక్టర్ల ఎంపిక , నేపధ్య సంగీతం , డైలాగ్స్ , ప్రతిదీ బ్రహ్మాండంగా సమన్వయం చేసుకున్నారు .

హర్షద్ మెహతాని చూపకుండా హర్ష మెహరా అని పేరు ఉపయోగించి , అతని 1992 స్కాంని వినియోగించుకొని ఈ లక్కీ భాస్కర్ సినిమా కధను నేసాడు . Well done . ఓ సాదాసీదా బాంక్ కేషియర్ తన తెలివితేటలను డబ్బు సంపాదించటానికి ఎలా ఉపయోగించుకున్నాడో చాలా ఆసక్తికరంగా తీసారు .

జూదం ఆడటం తప్పు కాదు ; ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపకపోవటం తప్పనే సూక్తిముక్తావళిని ప్రేక్షకులకు బోధించారు ఈ సినిమాలో . డబ్బులు సంపాదించి అమెరికాకు చెక్కేయటం బాగా చూపించారు . లక్కీ భాస్కర్ పాత్రను దుల్కర్ సల్మాన్ , అతని భార్యగా మీనాక్షి చౌదరి చాలా బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రలలో టినూ ఆనంద్ , సచిన్ ఖేడ్కర్ , సాయికుమార్ , రాంకి , సర్వదామన్ బెనర్జీ , సుధ , తదితరులు బాగా నటించారు .

సినిమా చూస్తున్నప్పుడు NTR , జమున నటించిన ధనమా దైవమా గుర్తుకొస్తుంది . జి వి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం చాలా బాగుంది . పాటలూ బాగున్నాయి . సంభాషణలు పదునుగా ఉన్నాయి . నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది . ఓవరాల్ గా ఎక్సలెంట్ సినిమా .

CBI , IT , ED లను అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే కాదు ; డబ్బున్న పెద్దోళ్ళు కూడా ఎలా ఉపయోగించుకుంటారో సాయికుమార్ పాత్ర తెలుపుతుంది . CBI , IT , ED లలో పనిచేసే వారు కూడా మనుషులే కదా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*