
ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజిఆర్…
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ..
చేపల పెంపకంతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు..
▪️పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం నౌగూడ గ్రామం లో గిరిజన మత్స్యకారులుకు ఉచితంగా ఫింగర్ లెవల్ చేప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సుమారు 169 మత్స్యకార గిరిజన చెరువులకు ఉచితంగా 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, అలాగే 90% సబ్సిడీ పై మత్సకార పనిముట్లు జరుగుతుందని చెప్పారు.నేడు పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం నౌగూడ గ్రామ చెరువులో చేప పిల్లలను వదిలి, మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని, ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటుందని ఇప్పటివరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందని, గత ప్రభుత్వాలైతే మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని కులాలను కులవృత్తులను ఆధారపడి బ్రతికేవాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ పి.వి శ్రీనివాసరావు, (ఏ.డి)టి.సంతోష్ కుమార్,ఎం.డి.ఓ కాళీప్రసాద్,మరియు ముఖ్య నాయకులు,మత్స్యకారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
Be the first to comment