
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..
హైదరాబాద్: సామాన్యులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కోడిగుడ్ల ధరలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి.
హోల్ సేల్ మార్కెట్లలో ధర రూ. 5.90గా NECC ఖరారు చేసింది. దీంతో రిటైల్ మార్కెట్లలో రూ. 6.50 నుంచి 7 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో గుడ్డు ధరలు పెరగడం చాలా కామన్.
దానికి గల కారణం చలికాలంలో గుడ్డు వినియోగం పెరుగుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో కోడి గుడ్లను వాడడం వల్ల రేట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు కోడిగుడ్ల ధరలు మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సామాన్యులు షాక్ అవుతున్నారు.
Be the first to comment