
వైద్య సేవలు పేదలకు అందించడం ద్వారానే వృత్తిలో రోల్ మోడల్ గా నిలుస్తాం
ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
_వైద్యసేవలను పేదలకు అందించడం ద్వారానే వృత్తిలో రాణించడంతో పాటు రోల్ మోడల్ గా నిలుస్తామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.గుంటూరు మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్ధులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కళాశాల నుండి వైద్యులు ఎందరో రాణిస్తే శాసనసభ్యులుగా నిలిచిన వారిలో మూడవవానిగా తాను ఉండటం సంతోషంగా ఉందన్నారు.కళాశాలకు పేరు ప్రతిష్ఠలను తమ ద్వారా లభించడం గర్వకారణం అన్నారు.వైద్యవృత్తిలో క్రమశిక్షణను అలవర్చుకోవాలని,ఎప్పుడూ సేవాతత్వాన్ని వదులుకోవద్దన్నారు.అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించినప్పుడే సక్సెస్ రేటు అధికంగా ఉంటుందన్నారు.వృత్తి పరంగా నిజాయితీగా ఉండాలన్నారు.ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి వారంలో ఒక రోజు కేటాయించాలని,జీవనశైలిని ఉన్నతంగా మలుచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అన్నారు._
Be the first to comment