
చెన్నైలో వర్షా లు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్ష ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని CM స్టాలిన్ కోరారు. వర్షాల నేపథ్యంలో తిరుచ్చి, నాగపట్నం, తంజావూరు, తిరువరూర్ తదితర ప్రాంతాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 29 వరకు మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
Be the first to comment