
మహారాష్ట్ర ముఖ చిత్రం మార్చిన పవన్ కళ్యాణ్ – ఎంపీ బాలశౌరి
మహారాష్ట్ర ఎన్నికలలో విజయభేరి కి కారణం పవన్ కళ్యాణ్ – ఎంపీ బాలశౌరి
మహారాష్ట్రలో కూడా 100 % స్ట్రయిక్ రేటు సాధించాం – ఎంపీ బాలశౌరి
మహారాష్ట్రలో కూడా ప్రతిపక్షాన్ని నామమాత్రం చేశాం – ఎంపీ బాలశౌరి
ఫలితాలు వెలువడిన మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మార్చారని, ఆయన ప్రచారం చేసిన ప్రతీ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన డేగలూరు, భాక్రా, లాతూర్, షోలాపూర్ నార్త్ , సెంట్రల్, బాలర్షా, చందాపూర్, పూణే కంటిన్మెంట్ , కస్బా ప్రాంతాలలో బిజెపి అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పట్ల మహారాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు మరవలేమని ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఎలా అయితే విజయం సాధించారో, అదేవిధంగా మహారాష్ట్ర లోనూ జరిగిందని, ఇక్కడ లాగానే అక్కడ కూడా ప్రతిపక్షం మట్టి కరిచిందని అన్నారు. ఇక్కడ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినట్లే అక్కడ కూడా ప్రచారం చేసిన ప్రతీ నియోజక వర్గంలో గెలుపు సాధించివి అక్కడ కూడా 100 శాతం స్ట్రయిక్ రేటు సాధించారని ఆయన ప్రశంసించారు.
పవన్ కళ్యాణ్ గారికి దేశం పట్ల, సమాజం పట్ల ఉన్న నిబద్ధతే ఆయన విజయ రహస్యం అని కొనియాడారు.
నూతనంగా ఏర్పాటు కాబోతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు
Be the first to comment