
జనసేన అనంతపురము జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ అహుడ చైర్మన్ శ్రీ TC.Varun గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
అహుడ చైర్మన్ గా స్నేహితులైన జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారిని సోమవారము తన స్వగృహంలో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీ సూర్యనారాయణ, శ్రీ వన్నప్ప, శ్రీ రమేష్, శ్రీ మధుసూదన్, శ్రీ మురళి, శ్రీ తోట నాగరాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
Be the first to comment